ఇస్రో కొత్త ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియామకం

5-Point Guide To S Somanath, All you need to know about new ISRO chief Dr. S. Somnath, Gold-medalist rocket scientist S Somnath, Mango News, New Chief of ISRO, Rocket scientist S Somnath appointed as the new Chief, Rocket scientist S Somnath to be new Isro chief, S Somanath to be Appointed as New Chief of ISRO, S Somanath to be Appointed as New Chief of ISRO After K Sivan, S Somnath, S Somnath replaces K Sivan as new ISRO chief, Senior scientist S Somnath appointed as ISRO chairman, Somanath to be Appointed as New Chief of ISRO, Somnath appointed ISRO chief, who led Chandrayaan-2 rocket launcher project

ఇస్రో.. ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొత్త ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ కె. శివన్ స్థానంలో.. ఇస్రో తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్. సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రమ్ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్‌ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు సోమనాథ్.

ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్‌ పదవీ కాలం త్వరలోనే పూర్తవనుంది. జనవరి 12, 2022 న శివన్ పదవీ కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత సోమనాథ్ ఇస్రో కొత్త ఛైర్మన్‌గా నియమితులవనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ​ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్‌ అధిపతిగా వ్యవహరించనున్నారు. రానున్న రోజుల్లో ఇస్రో ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు ప్రయత్నిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే రాకెట్ సైన్స్ లో అనుభవం కలిగిన సోమనాథ్‌ను కేంద్రం కొత్త ఛైర్మన్ గా నియమించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =