ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ సమావేశం, అసెంబ్లీలో వ్యూహంపై చర్చ

#KCR, CM KCR, CM KCR Meeting, CM KCR Meeting Discuss Strategy for Assembly Sessions, CM KCR Meeting with Several MLAs, Strategy for Assembly Sessions, telangana assembly session dates, Telangana Assembly Sessions, Telangana Assembly Sessions 2020, Telangana Assembly Sessions News, Telangana CM KCR

సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలువురు ఎమ్మెల్యేలతో ఆగస్టు 26, బుధవారం నాడు ప్రగతి భవన్ లో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విప్ లు గొంగిడి సునిత, రేగ కాంతారావు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, చల్లా ధర్మారెడ్డి, గణేష్ గుప్త, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే రాష్ట్రంలో యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయని సీఎం వివరించారు. కరోనా నేపథ్యంలో వీసీల నియామకంలో జాప్యం జరిగిందని సీఎం చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =