దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌‌ పట్టాలు పంపిణీ

Andhra Pradesh, AP CM YS Jagan, AP CM YS Jagan Launches ROFR Pattas Distribution Program, AP News, ROFR pattas, ROFR Pattas Distribution Program, ROFR Pattas Distribution Program for Tribal Farmers, ROFR pattas for tribals, ROFR pattas to be distributed to tribals, Tribal Farmers

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి అక్టోబర్‌ 2, గాంధీ జయంతి రోజున ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు మేలుజరిగే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని క్యాంపు ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పట్టాల పంపిణీతో గిరిజన రైతులు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు పొందనున్నారు. మూడు లక్షల ఎకరాలకు సంబంధించి దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌‌ పట్టాలు పంపిణీ చేయనున్నారు. పట్టాల పంపిణీ కోసం లబ్ధిదారులకు కేటాయించిన భూమి వద్ద సరిహద్దులు గుర్తించడం, వారి పోటోలు తీయడం, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ డేటాబేస్‌ లో వివరాల నమోదు పక్రియనంతా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu