టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

Andhra Pradesh, AP Minister Perni Nani, AP News, Ex-Andhra Pradesh minister Kollu Ravindra arrested, Kollu Ravindra Taken into Police Custody, Police Arrested TDP Leader Kollu Ravindra, TDP Leader Kollu Ravindra, TDP Leader Kollu Ravindra Arrested

టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను జూలై 3, శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వైస్సార్సీపీ నేత, రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర్‌ రావు ఇటీవలే మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కొల్లు రవీంద్రపై నాలుగో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేసినట్టు నిందితులు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శుక్రవారం నాడు మచిలీపట్నం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని సీతారామపురం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు లొంగిపోయారు. కొల్లు రవీంద్రనును ప్రస్తుతం పోలీసులు విచారిస్తునట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here