కిసాన్ సూర్యోద‌య యోజ‌న‌ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Gujarat, Modi Inaugurates Three Key Projects in Gujarat, Narendra Modi Inaugurates Three Key Projects, Narendra Modi Inaugurates Three Key Projects in Gujarat, PM Modi, pm narendra modi, PM Narendra Modi Inaugurates Three Key Projects in Gujarat

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజ‌రాత్ రాష్ట్రంలో మూడు కీలక పథకాలను ప్రారంభించారు. ముందుగా గుజ‌రాత్ లోని రైతుల కోసం ‘కిసాన్ సూర్యోద‌య యోజ‌న’ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. పంటల సాగు కోసం ప‌గ‌టి పూట విద్యుత్తు స‌ర‌ఫ‌రాను చేయడానికి ‘కిసాన్ సూర్యోద‌య యోజ‌న’ పథకాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు సీఎం విజ‌య్ రూపాని నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ఈ ప‌థ‌కంలో భాగంగా రైతులకు ఉద‌యం 5 గంట‌లు మొద‌లుకొని రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా సౌక‌ర్యాన్ని కల్పించనున్నారు. ఈ ప‌థ‌కంలో భాగంగా 2023 క‌ల్లా మౌలిక స‌దుపాయాల‌ను నెల‌కొల్ప‌డానికి గుజరాత్ ప్ర‌భుత్వం బడ్జెట్ లో రూ.3500 కోట్లు కేటాయించింది.

అలాగే యు.ఎన్.మెహ‌తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాల‌జీ అండ్ రిస‌ర్చ్ సెంట‌ర్ కు అనుబంధంగా ఏర్పాటైన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిట‌ల్ ను, అహ్మదాబాద్ సివిల్‌ హాస్పిటల్ లోని టెలి-కార్డియాల‌జీ విభాగం కోసం అభివృద్ధిచేసిన మొబైల్ అప్లికేష‌న్ ను కూడా ప్రధాని మోదీ పారంభించారు. యు.ఎన్. మెహ‌తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాల‌జీ 470 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ప‌డ‌క‌ల సంఖ్యను 450 నుంచి 1251 కి విస్తరించింది. దీంతో యు.ఎన్. మెహ‌తా ఇన్స్టిట్యూట్ ప్ర‌పంచ స్థాయి వైద్య సంబంధిత మౌలిక స‌దుపాయాలు క‌లిగిన అతి కొద్ది ఆసుప‌త్రులో ఒకటిగా నిలవడమే కాకుండా, ‌దేశంలో గుండె జబ్బుల చికిత్స‌కు ఏర్పాటైన అతి పెద్ద ఆసుప‌త్రి పేరును తెచ్చుకోనుంది. అలాగే రాష్ట్రంలో గిర్‌ నార్ రోప్ వే కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twenty =