ఏడుగంటల పాటు ఐశ్వర్యను ప్రశ్నించిన ఈడీ

Congress Leader DK Shivakumar Daughter Aishwarya, D K Shivakumar daughter appears before ED, ED Grills Congress Leader DK Shivakumar Daughter, ED Grills Congress Leader DK Shivakumar Daughter Aishwarya, ED Grills DK Shivakumar Daughter Aishwarya, Karnataka Congress leader DK Shivakumar Arrest, Karnataka Political News, Karnataka Politics Latest News, Mango News Telugu

కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను మనీ లాండరింగ్ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో డీకే శివ కుమార్ కుమార్తె ఐశ్వర్యను కూడ ఈడీ అధికారులు ప్రశ్నించారు. గురువారం నాడు విచారణకు హాజరైన ఐశ్వర్యను ఏడుగంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. శివకుమార్ కస్టడీ మరో రోజులో ముగుస్తుందనగా ఈడీ అధికారులు ఐశ్వర్యను ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నించారు.

ఐశ్వర్య పేరుమీదనే ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు కావడంతో పాటు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె ఆస్తి విలువ పెరిగిన పరిణామాలపై ఈడీ దృష్టి సారించింది. 2018 లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐశ్వర్య ఆస్తి విలువ రూ. 108 కోట్లుగా ప్రకటించారు. 2013 లో రూ.1.09 కోట్లుగా ఉన్న ఆస్తి విలువ, రూ. 108 కోట్లకు ఎలా పెరిగిందంటూ ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. విచారణ సందర్భంగా ఆమె వాంగ్మూలాన్నీ నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు 9 రోజుల కస్టడీ ముగియడంతో డీకే శివ కుమార్ ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

 

[subscribe]
[youtube_video videoid=_JkNRw-C_ow]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =