తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల బోధనలో కీలకపాత్ర పోషిస్తున్న టి-సాట్ నెట్‌వర్క్ ఛానళ్లు మరో మైలు రాయిని దాటాయి. అనతి కాలంలోనే టి-సాట్ యాప్ 10 లక్షల (వన్ మిలియన్) డౌన్‌లోడ్ లు కావడంతో రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ టి-సాట్ టీమ్ ను అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు. ముందుగా టి-సాట్ నెట్‌వర్క్ ఛానళ్ల యాప్ పది లక్షల డౌన్‌లోడ్ లు కావడంతో బుధవారం నాడు మంత్రి కేటిఆర్ ను తన క్యాంపు కార్యాలయంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ అధికారులతో కలిసి మొబైల్ యాప్ ను ప్రదర్శిస్తూ అభినందనలు తెలిపారు.
విద్యార్థులకు కష్ట కాలంలో టి-సాట్ యాప్ ఎంతగానే ఉపయోగపడిందని, కోవిడ్-19 ప్రభావంలో విద్యా శాఖకు ప్రత్యామ్నాయ మార్గంగా టి-సాట్ నెట్‌వర్క్ ఏర్పడిందన్నారు. డిజిటలైజషన్ విద్యను మారు మూల ప్రాంత ప్రజలకు, పేద విద్యార్థులకు అందించడంలో టి-సాట్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఒక విద్యా శాఖకే టి-సాట్ సేవలు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటికీ వేదికగా నిలిచిందన్నారు. వ్యవసాయ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, సాంఘిక గురుకుల సంక్షేమ శాఖల వంటి రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు టి-సాట్ ప్రధాన వేదికగా నిలిచిందని మంత్రి కేటిఆర్ కోనియాడారు. భవిష్యత్ లో టి-సాట్ సేవలు మరింతగా విస్తరించే విధంగా కొత్త ఆవిష్కరణలు చేయాలని అధికారులకు సూచించారు.
ఇక నుండి సన్ డైరెక్ట్ లోనూ:
టి-సాట్ నెట్‌వర్క్ ఛానళ్లు ఇక నుండి సన్ డైరెక్ట్ డీటీహెచ్ లోనూ ప్రసారాలు ప్రారంభించనున్నాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ లో విద్య-195, నిపుణ-196 నెంబర్లలో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఏయిర్ టెల్ డీటీహెచ్ లో విద్య-948, నిపుణ-949, టాటా స్కై విద్య-1479, నిపుణ-1480 నెంబర్లలో ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని సీఈవో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 43 కేబుల్ నెట్‌వర్క్ ఆపరేటర్ల ద్వార, టి-సాట్ డీటీహెచ్ ద్వారా ప్రసారాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్: