ట్రైన్‌లో గర్భిణీకి పురిటి నొప్పులు, ప్రసవం చేసి తల్లీ-బిడ్డను కాపాడిన మెడిక‌ల్ స్టూడెంట్‌.. మంత్రి కేటీఆర్ సహా పలువురి ప్రశంసలు

Minister KTR Congratulates Medicine Student who Helps Pregnant Woman To Deliver Baby in Duronto Express Train, Medical Student Helps Woman Deliver Baby , Andhra Medico Helps Deliver Baby Girl , Medicine Student Helps Pregnant Woman , Mango News, Mango News Telugu, Medical Student Helps Woman Give Birth On Board, Medicine Student Helps Woman Give Birth, Duronto Express Train, Duronto Express Baby Deliver, Duronto Express Woman Delivery Baby, Duronto Express Latest News And Updates, Duronto Express Train News And Live Updates

ప్రయాణిస్తున్న ట్రైన్‌లో ఒక మెడిక‌ల్ స్టూడెంట్‌ చూపిన తెగువ ఇద్దరి నిండు ప్రాణాలను కాపాడింది. చదువుతోంది మెడిసిన్ అయినా, తనకు అంతగా అనుభవం లేకపోయినా ఏమాత్రం వెరవకుండా ఆ స్టూడెంట్‌ కదులుతున్న ట్రైన్‌లో ఒక మహిళకు అర్ధరాత్రి వేళ పురుడు పోసి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడింది. ఆపత్కాలంలో ఆ అమ్మాయి చూపిన సమయస్ఫూర్తికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో తెలిపారు. క‌దులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్‌మెంట్ లేకుండానే ఒక గర్భిణీకి పురుడు పోసిన ఆ హౌస్ సర్జ‌న్ కి అభినందనలు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. స్వాతి రెడ్డి అనే వైద్య విద్యార్థి సోమవారం రాత్రి విశాఖపట్నం వెళ్ళడానికి విజయవాడలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. ఈ క్రమంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న శ్రీకాకుళానికి చెందిన సత్యవతి అనే ఒక మహిళకు అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కంగారుపడ్డ ఆమె భర్త స్వాతి రెడ్డి బెర్త్‌ వద్దకు వచ్చి, తన భార్యకు నొప్పులు వస్తున్నాయని, సాయం చేయాలని కోరారు. అయితే తనవద్ద ఎలాంటి వైద్య పరికరాలు లేకపోయినా వెంటనే స్పందించిన స్వాతి ధైర్యంగా ఒక్కర్తే నిమిషాల వ్యవధిలోనే మహిళకు నార్మల్‌ డెలివరీ చేశారు. కాగా అర్ధరాత్రి వేళ సాయం చేసి తల్లీబిడ్డలను కాపాడిన స్వాతిరెడ్డికి సత్యవతి దంపతులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక ఈ విషయం బయటకు తెలియడంతో పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వాతి రెడ్డిని అభినందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + three =