కరోనా వ్యాక్సిన్‌ పరిశోధనలకు రూ.900 కోట్లు, ఎరువుల సబ్సిడీకి రూ.65,000 కోట్ల కేటాయింపు

Finance Minister Nirmala Sitharaman Announces Aatmanirbhar Bharat Abhiyan Package 3.0

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుంది. మార్చి చివరిలో ముందుగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చారు. అనంతరం మే నెలలో “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.11,02,650 లక్షల కోట్లతో పలు రంగాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ తీసుకొచ్చింది. అలాగే అక్టోబర్ లో 73,000 కోట్లతో ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్ 2.0 ను ప్రకటించారు. తాజాగా ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్ 3.0 కింద రూ.2,65,080 కోట్లతో 12 కీలక ప్రకటనలు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు మీడియాకు వెల్లడించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్ 3.0: 12 కీలక ప్రకటనలు

  1. వ్యవసాయానికి మద్దతు: ఎరువుల సబ్సిడీ కింద రైతులకు రూ.65,000 కోట్ల కేటాయింపు.
  2. కరోనా వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు/పరిశోధన నిమిత్తం ఆర్‌అండ్‌డీ విభాగానికి రూ.900 కోట్ల నిధులు కేటాయింపు.
  3. ఉద్యోగ అవకాశాలను కల్పనకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పేరుతో కంపెనీలకు ప్రోత్సాహకాలు.
  4. రూ.3 లక్షల కోట్లతో ఇప్పటికే అమలు ఉన్న ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలు చేయాలని నిర్ణయం.
  5. ఉత్పాదక సామర్థ్యాలు మరియు ఎగుమతులను మెరుగుపరచడం కోసం 10 కీలక రంగాలకు పీఎల్ఐ స్కీం కింద రూ.1,45,980 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు.
  6. పీఎం ఆవాస్‌ యోజనకు అదనంగా రూ.18వేల కోట్లు కేటాయింపు. కొత్తగా 12 లక్షల ఇళ్ల నిర్మాణం. అదనంగా 78 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం.
  7. నిర్మాణం మరియు మౌలిక సదుపాయాలకు మద్దతు: ప్రభుత్వ టెండర్స్ పెర్ఫార్మన్స్ సెక్యూరిటీ మరియు ఈఎండిపై మిహాయింపులు.
  8. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కోసం డిమాండ్ బూస్టర్: డెవలపర్లు మరియు గృహ కొనుగోలుదారులకు ఆదాయపు పన్ను ఉపశమనం.
  9. జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధికి రూ.6,000 ఈ‍క్విటీ పెట్టుబడులు. రూ. 1.1 లక్షల కోట్ల సమీకరణతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు నిధులు.
  10. గ్రామీణ ఉపాధి: గరీబ్‌ కళ్యాణ్ రోజ్ గార్‌ యోజన పథకానికి రూ.10,000 కోట్ల అదనపు కేటాయింపులు.
  11. ప్రాజెక్ట్ ఎగుమతుల కోసం ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.3000 కోట్ల క్రెడిట్ కేటాయింపు.
  12. డిఫెన్స్, పారిశ్రామిక ప్రోత్సాహకాలు మరియు మౌలిక సదుపాయాలు, గ్రీన్‌ ఎనర్జీ కోసం రూ. 10,200 కోట్లు కేటాయింపు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ