జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రజలు ఓటుహాక్కును వినియోగించుకున్నారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ రోజు పోలింగ్ లో భాగంగా ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదులు అందడంతో ఓల్డ్ మలక్‌పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ను రద్దు చేశారు. అక్కడ నవంబర్ 3 న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత వెలువడాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను కూడా నిషేదించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రకటించారు. రీపోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ