ఈ నెల 23న తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. చేవేళ్లలో భారీ బహిరంగ సభకు హాజరు

Union Home Minister Amit Shah To Attend Public Meeting At Chevella On April 23 During Telangana Visit,Union Home Minister Amit Shah To Attend Public Meeting,Public Meeting At Chevella On April 23,Amit Shah At Chevella During Telangana Visit,Mango News,Mango News Telugu,Amit Shah Coming To Telangana,HM Shri Amit Shah Addresses A Public Meeting,Ministry Of Home Affairs,Home Minister Of India 2023,Amit Shah At Chevella Today,Amit Shah At Chevella Telangana,Amit Shah At Chevella Road,Amit Shah At Chevella Constituency,Amit Shah Telangana Visit Latest News,Amit Shah Telangana Live News

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న పట్టుదలగా ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం త్వరలో కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న తెలంగాణలో కూడా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నందున, ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులను ఢిల్లీకి పిలిపించి మంతనాలు చేసిన విషయం తెలిసిందే.

కాగా కర్ణాటక ఎన్నికల తర్వాత అమిత్‌ షా తెలంగాణపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 23న అమిత్‌ షా తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా చేవేళ్ల పార్లమెంట్‌ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 23న కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని నేరుగా హైదరాబాద్ చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి చేవెళ్లకు వెళ్లనున్నారు. దీంతో అమిత్‌షా సభను భారీ సక్సెస్‌ చేయాలని భావిస్తున్న బీజేపీ శ్రేణులు, బహిరంగ సభకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అమిత్ షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశముందని వారు చెబుతున్నారు. ఈ మేరకు అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా తెలంగాణలో పర్యటిస్తున్న రోజే మాజీ మంత్రి, బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనుండటం విశేషం. ఆయనకు బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మరో బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా హాజరుకానున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని రాహుల్‌ గాంధీ ఆహ్వానించినట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =