ఏపీలో 45 రోజులపాటు యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు

Andhra Pradesh, AP CM, AP CM YS Jagan, AP CM YS Jagan held Review over Development Works, AP CM YS Jagan held Review with Collectors, AP Development Works, AP Development Works news, AP Development Works Updates, AP News, Mango News Telugu, YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan Review with Collectors SPs and JCs

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల మరమ్మతులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనవరం 10వ తేది నుంచి 45 రోజులపాటు యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి రూ.560 కోట్ల ఖర్చుకు ఈనెల 10వ తేదీలోపు టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు. మరమత్తులు పనులపైనా కూడా పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో చివరి రెండు సంవత్సరాలు పట్టించుకోలేదని, మన అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ వర్షాలు పడ్డాయని దీని వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ సంవత్సరం అంతా మరమ్మతులపైన దృష్టిపెడుతున్నామని తెలిపారు. ఇవిగాక మరో రూ.2వేల కోట్లుతో కూడా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెడుతున్నామని, అందుకు సంబంధించి రుణాలు మంజూరు అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ