ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక, షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల సంఘం

Andhra Pradesh, Andhra Pradesh Legislative Council, Andhra Pradesh Legislative Council By Election, AP CM YS Jagan, AP Legislative Counci, AP Legislative Counci Election News, AP Legislative Counci Elections, AP News, By-Election to the Andhra Pradesh Legislative Council, Bye Election to the Andhra Pradesh Legislative Council, Bye Election to the AP Legislative Council, EC Released Schedule, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి వైస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బుధవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జనవరి 28 వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉపఎన్నిక షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – జనవరి 11
  • నామినేషన్లకు ఆఖరితేదీ – జనవరి 18
  • నామినేషన్ల పరిశీలన – జనవరి 19
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – జనవరి 21
  • ఎన్నిక జరిగే తేదీ – జనవరి 28
  • పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – జనవరి 28 సాయంత్రం 05:00 కు
  • ఎన్నికల ముగింపు తేదీ – ఫిబ్రవరి 1
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =