వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు..? జాబితా వైరల్

YCP, MP Candidates, YCP MP Candidates Finalized..?, Lok Sabha Elections, AP Politics, YSRCP Ticket, Jagan, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP CM Jagan, Andhra Pradesh Political Updates, Political News and Updates, Mango News Telugu, Mango News
YCP, YCP MP Candidates, Lok Sabha Elections, AP Politics

త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ గెలుపు గుర్రాలను మిగతా పార్టీలకంటే ముందే బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 50 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులు.. దాదాపు 10 మంది ఎంపీ అభ్యర్థులను కదణరంగంలోకి దింపేశారు. ఇక మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎంపీల జాబితాను జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ జాబితా వైరలవుతోంది.

ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానం నుంచి మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను బరిలోకి దింపనున్నారట. కర్నూల్ నుంచి మేయర్ రామయ్యను ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారట. నంద్యాల నుంచి హాస్యనటుడు ఆలీని రంగంలోకి దించుతారని తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి.. బొత్స ఝాన్సీని పోటీ చేయించనున్నారట.

ఇక శ్రీకాకుళం నుంచి పేడాడ తిలక్.. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్..విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాసరావు.. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్.. నర్సాపురం నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన గుబ్బల తమ్మయ్యలను తమ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. అటు ఇప్పటికే విజయవాడ ఎంపీ టికెట్‌ను కేశినేని  నానికి ఖరారు చేశారు. అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను రంగంలోకి దింపుతున్నారట. కడప నుంచి మరోసారి అవినాశ్ రెడ్డినే బరిలోకి దింపనున్నారట.

ఏలూరు నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను.. అమలాపురం నుంచి కొత్త వ్యక్తిని బరిలోకి దింపేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట. అలాగే ప్రస్తుతం పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కె భాగ్యలక్ష్మిని అరకు నుంచి ఎంపీగా పోటీ చేయించనున్నారట. ఇక మచిలీపట్నం అసెంబ్లీ టికెట్ తన కుమారుడికి ఇవ్వడంతో.. మంత్రి పేర్నినాని మంచిలీపట్నం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారట. ఇక ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. తిరుపతి నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బరిలోకి దింపేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట. ఇందులో కొందరి పేర్లను ఇంఛార్జ్‌ల మార్పు జాబితాలో ఇప్పటికే ప్రకటించినప్పటికీ.. మిగిలిన వారిని కూడా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =