అక్టోబర్ 1న స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అమృత్ 2.0 ప్రారంభించనున్న పీఎం మోదీ

AMRUT 2.0, Mango News, PM Modi, PM Modi to launch Swachh Bharat Mission, PM Modi to Launch Swachh Bharat Mission-Urban 2.0, PM Modi to Launch Swachh Bharat Mission-Urban 2.0 and AMRUT 2.0 on OCT 1st, PM to launch Swachh Bharat Mission, PM to launch Swachh Bharat Mission-Urban 2.0, PM to launch Swachh Mission 2.0, PM to launch Swachh Mission 2.0 on October 1, Swachh Bharat Mission, Swachh Bharat Mission 2.0, swachh bharat mission urban 2.0 guidelines, Swachh Bharat Mission-Urban 2.0

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1వ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌ లో ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలను దేశంలోని నగరాలన్నింటినీ వ్యర్ధ/చెత్త రహితంగా మరియు నీటి భద్రతగా మార్చాలనే ఆకాంక్షను నెరవేర్చుకేందుకు రూపొందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయ మంత్రి, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కూడా పాల్గొననున్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 ద్వారా అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చడం మరియు అమృత్ పథకం కింద కవర్ కానీ నగరాల్లో గ్రే, బ్లాక్ నీటి నిర్వహణ చేపట్టనున్నారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఓడిఎఫ్+గా, 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలను ఓడిఎఫ్++గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కోసం దాదాపు రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక అమృత్ 2.0 ద్వారా దాదాపు 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో, దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను అందించి, అన్ని ఇళ్లకు 100% నీటి సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నారు. 500 అమృత్ నగరాల్లో 2.64 కోట్ల మురుగు/సెప్టేజ్ కనెక్షన్ల ఏర్పాటు, ఇతర అంశాలతో కలుపుకుని అమృత్ 2.0 కోసం దాదాపు రూ.2.87 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ