తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 6, బుధవారం నుంచి అక్టోబర్ 17, ఆదివారం వరకు దసరా సెలవులను ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 18వ తేదీన పునఃప్రారంభం కానున్నట్టు తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఘనంగా జరుపుకునే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పండుగలను పురస్కరించుకుని పాఠశాలలకు ఆదివారాలలో కలిపి మొత్తం 12 రోజుల పాటుగా సెలవులు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కళాశాలలకు నాలుగు రోజుల పాటుగా అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు. జూనియర్ కళాశాలలు తిరిగి 17వ తేదీన పునః ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ










































