ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించి మంత్రివర్గం తీర్మానం చేసి ఫైలు గవర్నర్‌కు పంపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ నిర్ణయం ప్రకారం జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కాగా, ఇటీవల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో.. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ