తెలంగాణకు చేసింది ఏమీ లేదు, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు

CM KCR over Development of Telangana, Development of Telangana, Mango News, Mango News Telugu, Sharmila Comments on KCR, Sharmila Comments on PM, YS Sharmila, YS Sharmila Comments on KCR, YS Sharmila Comments on PM Modi, YS Sharmila Comments on PM Modi CM KCR over Development of Telangana, YS Sharmila Lashes Out At CM KCR, YS Sharmila Over Development of Telangana, YS Sharmila Party, YS Sharmila Slams CM KCR Over Telangana Development, YS Sharmila slams KCR, YSRTP YS Sharmila

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై వైఎస్ షర్మిల వరుస ట్వీట్స్ చేశారు. “మోదీ, కేసీఆర్ లు ఇద్దరు ఓకే తాను ముక్కలు. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమిలేదు, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ గారు ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు. ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారు” అని అన్నారు.

“మోదీ తెలంగాణకు అన్యాయం చేసి మహారాష్ట్రపై ప్రేమ కురిపించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడింది లేదు. మోదీ కేంద్ర విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది లేదు. కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించింది లేదు. రేపు రాబోవు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీలు లేఖాస్త్రాల డ్రామాలకు తెరలేపాయి తప్ప తెలంగాణకు కేసీఆర్, మోదీలు చేసింది ఏమీ లేదు. దొందూ దొందే, ఇద్దరు దొంగలే” అని వైఎస్ షర్మిల విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =