ఐపీఎల్-2022: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌

Shreyas Iyer Named as New Captain of Kolkata Knight Riders for Upcoming IPL

రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ నియమితుడయ్యాడు. ఈ మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్-2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ ను కోల్‌కతా రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో కేకేఆర్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా వ్యవహరించగా ఇకపై శ్రేయాస్ అయ్యర్‌ ఆ బాధ్యతలు స్వీకరించనున్నాడు. శ్రేయాస్‌ ను వేలంలో విజయవంతంగా దక్కించుకున్నందుకు, కెప్టెన్ గా అవకాశం ఇచ్చేందుకు సంతోషిస్తున్నామని కేకేఆర్ సీఈఓ అండ్ ఎండీ వెంకీ మైసూర్ తెలిపారు. అతను బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్ గా రాణిస్తాడనే నమ్మకముందని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ