బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం ప్రారంభం

Bollaram Rashtrapati Bhavan, Mango News Telugu, National News Telangana Political Live Updates, Political Updates 2020, President Ram Nath Kovind, telangana, Telangana Breaking News, Telangana Political Updates
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15 గంటలకు హకీంపేట నుంచి రాష్ట్రపతి కోవింద్ డిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు.

[subscribe]