మేడారం మహా జాతర ప్రారంభం.. భారీగా తరలి వెళ్తున్న భక్తజనం

Helicopter Services for Medaram Jathara, Helicopter Services for Medaram Maha Jathara, Mango News, Medaram Jatara Latest Updates, Medaram Jathara, Medaram Jathara Latest News, Medaram Jathara Updates, Medaram Maha Jatara, Medaram Maha Jatara Asia’s Biggest Tribal Festival, Medaram Maha Jatara Asia’s Biggest Tribal Festival Starts Today, Medaram Maha Jathara, medaram sammakka sarakka jatara, Participating Lakhs of Devotees, sammakka sarakka, sammakka sarakka jatara, Sammakka Sarakka Jatara 2022

మేడారం మహా జాతర.. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. మేడారం అటవీప్రాంతం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. పల్లెలనుంచి, పట్నాల నుంచి, పోరు రాష్ట్రాల నుంచి.. ఎడ్లబండ్లు, బైకులు, బస్సులు, ఆటోలు, జీపులు, కార్లలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరుగుతుంది. భారతదేశంలో కుంభమేళా తర్వాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే జాతర ఇదే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటిగా భావిస్తారు. 2018లో 10 మిలియన్ల మంది భక్తులు హాజరైనట్లు ఒక అంచనా. పేరుకి ఇది ఆదివాసీలదే అయినా.. గిరిజనేతర భక్తులే అధికంగా వస్తారు.

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం అటవీ ప్రాంతంలోని ఒక మారుమూల కుగ్రామం మేడారం. దట్టమైన అడవుల్లో జరిగే ఈ మహా జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్ గఢ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిసా నుంచి భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంప్రదాయంలో జరిగే ఈ జాతరలో దేవతామూర్తుల విగ్రహాలు ఉండవు. అక్కడి పూజారులందరూ ఆదివాసీలే. వనదేవతల స్మారకార్థం నిర్మించిన గద్దెలపైనే పూజలు నిర్వహిస్తారు. పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, ఎదుర్కోళ్లు, బంగారం (బెల్లం) ప్రధాన మొక్కులు. అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకులతో తల్లి మరియు కుమార్తె.. సమ్మక్క మరియు సారలమ్మ చేసిన పోరాటాన్ని ఈ జాతర ప్రతిబింబిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =