మార్చి 6 నుంచి 8 వరకు ‘కేసీఆర్‌ మహిళా బంధు’ పేరుతో సంబరాలు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

International Women's Day KTR Called for KCR Mahila Bandhu Celebrations From March 6 to 8th, International Women's Day, Women's Day, KCR Mahila Bandhu Celebration, KTR Called for KCR Mahila Bandhu Celebrations From March 6 to 8th, KCR Mahila Bandhu Celebrations From March 6 to 8th, Mahila Bandhu Celebrations From March 6 to 8th, KTR Called for KCR Mahila Bandhu Celebrations, KCR Mahila Bandhu Celebrations From March 6, KCR Mahila Bandhu Celebrations Ends On March 8th, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, Telangana, Mango News, Mango News Telugu,

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటుగా ‘కేసీఆర్‌ మహిళా బంధు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆడబిడ్డల సంక్షేమం, సంరక్షణ, అభివృద్ధికై దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని, ఈ నేపథ్యంలో మహిళల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు. ‘కేసీఆర్‌ మహిళా బంధు’ సంబరాల్లో భాగంగా 6వ తేదీన ఆడబిడ్డలు సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టడంతో సంబరాల ప్రారంభమవుతాయన్నారు.

అదే రోజున పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళా లీడర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు గౌరవపూర్వక సన్మానం చేయాలని సూచించారు. అలాగే కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ పేరుతో మానవహారాల ఏర్పాటు చేయాలన్నారు. ఇక మార్చి 7వ తేదీన కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటి వద్దకు వెళ్లి కలవాలని, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. మార్చి 8వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మహిళలతో టీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశాల ఏర్పాటుతో పాటుగా మహిళా దినోత్సవ సంబరాలను పెద్దఎత్తున నిర్వహించాలని కేటీఆర్ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ