తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1269 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 34,671 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 8,153 శాంపిల్స్ పరీక్షించగా 6,884 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 800, రంగారెడ్డిలో 132, మేడ్చల్ లో 94, సంగారెడ్డిలో 36, కరీంనగర్ లో 24, నాగర్ కర్నూల్ 23, మహబూబ్ నగర్ లో 17, వనపర్తిలో 15, నల్గొండలో 15, మెదక్ లో 14, వరంగల్ అర్బన్ లో 12, నిజామాబాద్ లో 11, పెద్దపల్లిలో 9, మహబూబాబాద్ లో 8, గద్వాల్ లో 7, సూర్యాపేటలో 7, యాదాద్రిలో 7 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 12, సాయంత్రం 5 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 34,671
కొత్తగా నమోదైన కేసులు (జూలై 11 – జూలై 12 (5PM-5PM) : 1269
నమోదైన మరణాలు : 8
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 22,482
యాక్టీవ్ కేసులు : 11,883
మొత్తం మరణాల సంఖ్య : 356
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu