ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించడాన్ని స్వాగతించింది. ఈ మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారి ఒక గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని, అందుకే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ పేర్కొంది. గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా, ద్రౌపది ముర్ముకి మద్దతు తెలుపుతున్నామని వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టం చేసింది. కాగా ఈరోజు ద్రౌపది ముర్ము నామినేషన్ వేయనుండగా, అదే సమయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దీనిలో పాల్గొనేందుకు పార్టీ తరపున విజయసాయి రెడ్డితో పాటు లోక్‌సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.
ఇక బిజెడి, జెడియు ఇప్పటికే ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడంతో ఆమె ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనున్నంది. ఈ క్రమంలో తదుపరి రాష్ట్రపతిని ఎన్నికోవడానికి జూలై 18న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలు మరియు శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ఈ సభ్యుల మొత్తం ఓట్ల విలువ 10,86,431. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 కాగా, ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY