గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఏరియల్ సర్వే పూర్తి చేసుకున్న అనంతరం గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర సంబంధిత అధికారులతో సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు సహా పలు జిల్లాల అధికారులతో గోదావరి వరద పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియమించి, పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 24 గంటలు పాటుగా హైఅలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. మరోవైపు వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, వారికీ అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవలుపై సీఎం వైఎస్ జగన్ వివరాలు తెలుసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY