గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ఏపీకి రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ముగింపు ప్రసంగంలో వెల్లడించిన సీఎం జగన్

Vizag Global Investors Summit CM Jagan Addressed The Concluding Speech Announces AP Gets Over Rs.13 Lakh Cr Investments,Vizag Global Investors Summit,CM Jagan Addressed The Investments,AP Gets Over Rs.13 Lakh Cr Investments,CM Jagan Concluding Speech,Mango News,Mango News Telugu,Global Investors Summit, AP clinches investments,AP attracts 13 lakh crore Investment,Andhra Pradesh received investments,G20 Summit,G20 Summit 2023,G20 India,G20 Summit 2023 India LIVE,G20 Summit LIVE,G20 India LIVE,G20 India 2023,2023 G20

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ వేదికగా తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ముగిసింది. క ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముగింపు ప్రసంగంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గడచిన రెండు, మూడేళ్ళుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పెను సవాలును ఎదుర్కొందని, ప్రస్తుతం ఆ సమస్యలను అధిగమిస్తున్నామని, కీలక సమయంలో ఈ సమ్మిట్ నిర్వహించామని పేర్కొన్నారు. గత మూడున్నరేళ్లుగా ఏపీ అభివృద్ధిపథంలో పయనిస్తోందని, పారదర్శక పాలనతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు.

ఇక ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపిన సీఎం జగన్, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని వెల్లడించారు. ఈ సదస్సు ద్వారా దాదాపు 350కి పైగా పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామని, వీటి విలువ రూ. 13 లక్షల 5వేల 663 కోట్లు అని వివరించారు. ఈ మొత్తం పెట్టుబడుల్లో రూ. 8,84,000 కోట్లు కేవలం ఎనర్జీ రంగం నుంచే వచ్చాయని, అలాగే పర్యాటక రంగంలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇక వీటి ద్వారా 6 లక్షల 3 వేలకు పైగా మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం జగన్ చెప్పారు. ఇక ఈరోజు సదస్సుకు హాజరైన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతమని పేర్కొన్నారు. ఇక ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్‌ ప్రకటించిందని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + ten =