ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (సెప్టెంబర్ 3, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం, పోడుభూముల సమస్య, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, సాగునీటి ప్రాజెక్ట్స్, అదనపు వనరుల సమీకరణ, విద్యుత్ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఆదేశాలు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది.
అదేవిధంగా భారత్ యూనియన్ లో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమై 74 సంవత్సరాలు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో “తెలంగాణ వజ్రోత్సవాలు” పేరుతో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తెలంగాణ వజ్రోత్సవాలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇక కేబినెట్ సమావేశం అనంతరం, తెలంగాణ భవన్ లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY