ఏపీలో వచ్చే ఎన్నికల్లోగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టొచ్చు – మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Minister Gudivada Amarnath Announces Three Capitals To be Formed Before Assembly Polls in AP, AP IT Minister Assures 3 State Capitals Ahead Of Next State Assembly Elections, Next State Assembly Elections, State Assembly Elections, 3 State Capitals, AP IT Minister, YSRCP Government would soon form three capitals of the State, AP IT Minister Gudivada Amarnath, bulk drug park, AP 3 State Capitals, Andhra Pradesh Legislative Assembly, AP 3 State Capitals News, AP 3 State Capitals Latest News And Updates, AP 3 State Capitals Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు రాజధానులపై స్పందించిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలోగా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్‌.. త్వరలో జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తామని స్పష్టం చేశారు. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై కొత్త బిల్లు పెట్టొచ్చని తెలిపారు. దీనికి సంబంధించి అసెంబ్లీలోనే సీఎం జగన్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏపీకి మూడు రాజధానులు ఉండాలి అనేది వైసీపీ పార్టీ విధానమని, ఈ బిల్లుకు మా పార్టీ కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు.

వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి చేశామని, ఇక ఈ రెండేళ్లలో మిగిలిన వాటినీ అమలు చేస్తామని అమర్‌నాథ్‌ అన్నారు. అయితే మేం కష్టపడి వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్‌ను జైలుకి పంపాలని వ్యాఖ్యానించారు. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించిన సమయంలో ఆయనతో ముచ్చటించిన బాలిక మృతి చెందడం బాధాకరమని, విలీన ప్రాంతాలకు త్వరలోనే అదనపు వైద్య బృందాలను పంపుతామని మంత్రి అమర్‌నాథ్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =