కేంద్ర మంత్రి ప్రవర్తన నన్ను భయపెట్టింది.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మద్దతుగా నిలిచిన మంత్రి కేటీఆర్

Minister KTR Supports Kamareddy Collector in The Issue of Ration Shop Raised by Union FM Nirmala Sitharaman, Union Finance Minister Nirmala Sitharaman, Minister KTR Supports Kamareddy Collector, Ration Shop Issue, Union FM Nirmala Sitharaman, Fair Price Shop, Kamareddy Ration Shop Issue, Kamareddy Collector, Telangana Minister KTR, Kamareddy Ration Shop Issue News, Kamareddy Ration Shop Issue Latest News And Updates, Kamareddy Ration Shop Issue Live Updates, Mango News, Mango News Telugu,

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీ రామారావు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు మద్దతు తెలిపారు. కాగా శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలో ఆయన కలెక్టర్‌కు బాసటగా నిలిచారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో వారి మధ్య జరిగిన సంభాషణపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కలెక్టర్‌ పాటిల్‌కు మద్దతుగా నిలిచారు. ఇక దీనిపై స్పందిస్తూ.. ‘కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవర్తన నన్ను భయపెట్టింది.. ఈ రాజకీయ నాయకులు కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను నిరుత్సాహపరుస్తారు. అయితే ఈ ఘటనలో హుందాగా ప్రవర్తించిన కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు నా అభినందనలు’ అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇక పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కామారెడ్డి జిల్లా, బీర్కూర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆమె ఒక్కో కుటుంబానికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను దీనిపై ప్రశ్నించారు. రేషన్‌ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? లబ్ధిదారుల వాటా ఎంత? అని అడిగారు. అయితే కేంద్రమంత్రి ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించడంతో.. ఈ ఊహించని పరిణామానికి కలెక్టర్‌ కొంచెం తడబడ్డారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి నిర్మలా సీతారామన్, ప్రభు త్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపైనే మంత్రి కేటీఆర్ స్పందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =