మెదక్-సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఆర్‌అండ్‌బీ అధికారులతో మెదక్-సిద్ధిపేట హైవేకు సంబంధించి రీచ్-1, రీచ్-2 పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంజూరైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు భూసేకరణ పూర్తి చేయాలని, రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఇక రీచ్-1 నేషనల్ హైవే సిద్ధిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు, అలాగే రీచ్-2 నేషనల్ హైవే మెదక్ జిల్లాలో మెదక్ టౌన్ నుంచి నిజాంపేట వరకు నిర్మాణం జరుపనున్నట్లు వెల్లడించారు.
ఇక మెదక్ నుంచి సిద్ధిపేట వరకు రూ.882.18 కోట్లతో మొత్తం 69.97 కి.మీ వరకు 4 లైన్ రోడ్ వేయనున్నామని, దీనిలో మెదక్ జిల్లాలో 33.676 కి.మీ, సిద్ధిపేటలో 36.302 కి.మీ మేర ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. దీనిలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో పోతిరెడ్డిపేట్, అక్బర్ పేట్, చిట్టాపూర్, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇర్కోడు, బూరుగుపల్లి గ్రామాలలో మరియు మెదక్ జిల్లాలో టౌన్‌తో పాటు పత్తూరు, అక్కన్నపేట్, రామాయంపేట్, కోనాపూర్, నందిగామా, నిజాంపేట్ గ్రామాలలో 4 లైన్ రోడ్లు వస్తాయని మంత్రి చెప్పారు. ప్రతి రోడ్డు పనులకు గడువు విధించి పూర్తి చేయాలని, ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. అలాగే నేషనల్ హైవే రోడ్డు సాగే గ్రామాల వెంట 4 లైన్ రోడ్, స్ట్రీట్ లైట్స్, ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా రెయిలింగ్, ఇరువైపులా వర్షపు నీరు నిలువకుండా సైడ్ డ్రైన్లతో పాటు ఫుట్ పాత్‌లు కూడా నిర్మించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE