కర్నూల్ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు గురువారం ఆదోనిలో రోడ్ షో నిర్వహించారు. ఆదోని పట్టణంలో చంద్రబాబు రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఆదోనిలో వీధులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. ఈ రోడ్ షోకు విశేష స్పందన రావడంతో స్థానిక పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకుంది. రోడ్ షో అనంతరం మధ్యాహ్నం ఆర్ట్స్ కాలేజీ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఎమ్మిగనూరు మండలంలోని చెన్నాపురం, వెంకటాపురంలో పర్యటిస్తారు. అదేవిధంగా సాయంత్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శ్రీనివాస సర్కిల్, సోమేశ్వర సర్కిల్ ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఎమ్మిగనూరు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. ఈ రాత్రికి కర్నూల్ చేరుకొని అక్కడే బస చేయనున్నారు.
మరోవైపు నిన్న పత్తికొండలో జరిగిన రోడ్‌షోలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని, అందుకే ఆవేదనతో సభలో నుంచి బయటకు వచ్చానని అన్నారు. అయితే వచ్చేముందు అసెంబ్లీలో శపథం చేశానని, మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించానని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సరే, లేదంటే ఇదే తనను చివరి ఎన్నిక అవుతుందని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీలో టీడీపీని గెలిపిస్తే అసెంబ్లీని మళ్ళీ గౌరవ సభగా మారుస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE