శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఆస్ట్రేలియాలోని సిడ్నీ కోర్టు

ri Lankan Cricketer Danushka Gunathilaka Granted Bail by Sydney Court Australia,Sri Lanka Cricket Board ,Danushka Gunathilaka Suspended,Sri Lanka Cricket Board Suspends Danushka,Mango News,Mango News Telugu,Sri Lanka Cricket Board Danushka Gunathilaka ,Danushka Gunathilaka Suspended From All Formats,Danushka Gunathilaka Suspended, Danushka Gunathilaka Latest News And Updates,International Cricket Board,ICC Latest News And Updates,Sri Lankan Cricketer Danushka Gunathilaka,Gunathilaka Granted Bail, Gunathilaka Granted Bail by Sydney Court

టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక ఒక స్థానిక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి గురువారం సిడ్నీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పార్క్‌లియా కరెక్షనల్ సెంటర్ నుండి వీడియో లింక్ ద్వారా సిడ్నీ యొక్క డౌనింగ్ సెంటర్ కోర్టు ముందు హాజరు కాగా, కోర్టు అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసులో నవంబర్ 7న బెయిల్ నిరాకరించబడినప్పటి నుండి 11 రోజుల పాటు ధనుష్క జైలులోనే ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ జోక్యంతో అతనికి బెయిల్ లభించింది. అయితే దీని కోసం అతను కోటి రూపాయలు జామీనుగా కట్టాల్సి వచ్చింది. ఇక ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు ధనుష్కను సస్పెండ్ చేసింది. ఒకవేళ అతనిపై నేరం రుజువైతే జీవితకాలం బహిష్కరించడంతో పాటు జరిమానా కూడా విధిస్తామని ప్రకటించింది.

కాగా నవంబర్ 6వ తేదీ తెల్లవారుజామున శ్రీలంక జట్టులోని మిగిలిన వారు హోటల్ రూమ్ నుంచి బయటకు వెళ్లడానికి ఒక గంట ముందు సిడ్నీ పోలీసులు ధనుష్కను అరెస్టుచేశారు. ఒక ఆన్‌లైన్ డేటింగ్ అప్లికేషన్ ద్వారా చాలా రోజులు మాట్లాడుకున్న తర్వాత సిడ్నీ యొక్క తూర్పు శివారు ప్రాంతంలో ధనుష్క మరియు ఒక 29 ఏళ్ల మహిళ కలుసుకున్నారని, ఈ క్రమంలో సదరు మహిళపై ఆటను అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు. ఇక బెయిల్ షరతుల్లో 1,50,000 ఆస్ట్రేలియన్ డాలర్ల ష్యూరిటీ, పాస్‌పోర్ట్ సరెండర్, రోజూ రెండుసార్లు పోలీసు రిపోర్టింగ్, రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ, ఫిర్యాదుదారుని సంప్రదించకపోవడం మరియు టిండర్ మరియు డేటింగ్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడంపై నిషేధం వంటివి ఉన్నాయి. ఈ ఆరోపణలపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో సహా ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను శ్రీలంక క్రికెట్ ఏర్పాటు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =