స్విగ్గీ ఆర్డర్స్‌లో టాప్ లేపిన హైదరాబాదీ బిర్యానీ

Swiggy Reveals Hyderabad Biryani Got Top Place in Their Orders For First Half of 2023,Swiggy Reveals Hyderabad Biryani,Hyderabad Biryani Got Top Place in Their Orders,Swiggy Orders For First Half of 2023,Swiggy Reveals Their Orders For First Half,Swiggy Biryani Orders 2023,Mango News,Mango News Telugu,Indias love for Biryani,Indians placed 7.6 crore biryani orders,Swiggy Delivers 7.6 Crore Biryani Orders,Swiggy reveals Indians ordered biryani,76 million biryani orders,Swiggy Latest News,Swiggy Latest Updates,Swiggy Biryani Orders Latest News,Swiggy Biryani Orders Latest Updates

హైదరాబాద్‌లో భోజనప్రియులను కట్టిపడేసే ఎన్ని వెరైటీ వంటకాలున్నా..టాప్ ప్లేస్ మాత్రం హైదరాబాదీ బిర్యానీదే అంటే ఎవరూ కాదనలేరు. తాజాగా ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) లెక్కలతో సహా చెప్పడంతో.. హైదరాబాద్ బిర్యానీ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండియా అయిపోయింది.

నిజమే హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు (Fans) ఉంటారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ హైదరాబాదీ బిర్యానీకి దాసోహం అనేంతగా తన రుచులతో అందరినీ కట్టిపడేసింది ఈ బిర్యానీ. అందుకే బయట నుంచి ఎవరు వచ్చినా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లలేరన్నది కూడా అతిశయోక్తి కాదు.

అల్లంత దూరం నుంచే బిర్యానీ ఘుమఘుమలతో నిండిపోతూ ఉండటంతో.. ఏ హోటల్‌కి వెళ్లినా, ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా మెయిన్ కోర్సులో ముందుండే బిర్యానీనే ఆర్డర్ చేస్తారు చాలామంది. అయితే బిర్యానీ( Biryani) వాసనలే కాదు… బిర్యానీ పేరు కూడా ఫుడ్ లవర్స్‌ మనసును లాగేస్తుందని..అందుకే ఫుడ్ ఆర్డర్స్‌లోనూ టాప్ బిర్యానీ అని.. స్విగ్గీ ఆర్డర్స్ లెక్కలు చెప్పడంతో ఏదయినా మా హైదరాబాదీ బిర్యానీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనని కాలర్ ఎగరేస్తున్నారు బిర్యానీ లవర్స్ (Biryani Lovers).

హైదరాబాద్ బిర్యానీ అంటే భాగ్యనగరవాసులకు ఎప్పుడూ మక్కువే. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ (Swiggy) ..లెక్కలతో సహా చెప్పింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే హైదరాబాద్ వాసులు ఆన్‌లైన్‌ (Online)లో 72 లక్షల బిర్యానీలు ఆర్డర్లు చేశారని చెప్పింది. ఈ విషయాన్ని రీసెంట్‌గా ప్రపంచ బిర్యానీ డే సందర్భంగా స్విగ్గీ తెలిపింది.దీంతో రెస్టారెంట్, హోటల్స్‌లో నోరూరించే ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ (Food Items) ఉన్నా..హైదరాబాద్ బిర్యానీ లేకపోతే ఆ భోజనం పూర్తవదు అన్న ఫీలింగ్‌లో భాగ్యనగరవాసులు ఉన్నారనడానికి ఈ ఆన్‌లైన్‌ ఆర్డర్లే ఉదాహరణగా నిలుస్తున్నాయి.

హైదరాబాద్ సిటీలో బిర్యానీని అందించే రెస్టారెంట్లు 16 వేలకు పైగా ఉన్నాయని.. వీటిలో ఎక్కువగా అమీర్ పేట్, బంజారాహిల్స్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్ , మాదాపూర్, కూకట్‌పల్లిలోనే ఉన్నాయని స్విగ్గీ ప్రకటించింది. అలాగే ఏరియాల పరంగా వచ్చిన ఆర్డర్లను చూస్తే.. కూకట్ పల్లి నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని చెప్పింది. ఆ తర్వాతి స్థానాల్లో మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, బంజారాహిల్స్ నిలిచాయని స్విగ్గీ తెలిపింది.

అలాగే దేశవ్యాప్తంగా వస్తోన్న ప్రతీ ఐదు ఆర్డర్లలోనూ ఒకటి..తప్పకుండా హైదరాబాదీ బిర్యానీ ఉంటుందని స్విగ్గీ చెప్పింది. అలాగే హైదరాబాద్ లో జనవరి 23వ తేదీ నుంచి..జూన్ 15 వ తేదీ మధ్య ఆర్డర్ల లెక్కను స్విగ్గీ తెలిపింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో హైదరాబాద్‌లో బిర్యానీ ఆర్డర్‌లు 8.39 శాతం పెరిగినట్లు పేర్కొంది. ఈ ఏడాది కాలంలో బిర్యానీ ఆర్డర్‌లు.. 150 లక్షలకు పైగా వచ్చినట్టుగా స్విగ్గీ ప్రకటించింది. ఇందులో తొమ్మిది లక్షలకు పైగా ఆర్డర్లతో దమ్ బిర్యానీ రికార్డు క్రియేట్ చేస్తే, డిఫరెంట్ ఫ్లేవర్స్ బిర్యానీ 7.9 లక్షల ఆర్డర్లతో తర్వాత స్థానంలోనూ..అలాగే సింగిల్ బిర్యానీ 5.2 లక్షలతో ఆ తర్వాత ప్లేసులలో ఉన్నాయని స్విగ్గి అనౌన్స్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE