గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఢిల్లీలోని షాలీమార్‌ బాఘ్‌లో గాంధీ సంకల్ప్‌ యాత్రను నిర్వహించారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేష్ చౌక్ వద్ద నుంచి గాంధీ సంకల్ప్‌ యాత్రను ప్రారంభించారు. ఈ సంకల్ప్‌ యాత్ర వెజిటబుల్ మార్కెట్, చింతల్ బస్తీ, రోడ్ నెం. 12 బంజారాహిల్స్ మీదుగా ఎన్బిటీ నగర్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో గొప్ప శక్తివంతంగా, అవినీతి రహితంగా భారతదేశాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. యాత్రలో పాల్గొన్న వారితో ప్లాస్టిక్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్రను చేపట్టనున్నట్లు చెప్పారు. 150 కిలోమీటర్ల వరకు సాగబోయే ఈ యాత్రలో స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ నిషేధంతో పాటు అనేక అంశాలపై ప్రజలకు అవగాహనా కల్పించబోతున్నట్టు పేర్కొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =