నేటి నుంచి నల్లమలలో మూడు నెలల పాటు జన సంచారం నిషేధం.. పులుల కోసం అటవీశాఖ నిర్ణయం

Ban on Movement of People in Nallamala Forest For 3 Months During Tigers Mate for Offspring,Ban on Movement of People in Nallamala Forest,Nallamala Forest Ban For 3 Months,Nallamala Forest During Tigers Mate for Offspring,People in Nallamala Forest,Mango News,Mango News Telugu,Ban on entry to Nallamala tourist spots,Wildlife conflict worsens in Nallamala region,Nallamala Forest News Today,Ban on entry to Nallamala tourist,Nallamala Forest Latest News,Nallamala Forest Latest Updates,Nallamala Forest Live News,Nallamala Tigers Mate Live Updates

ఆంధ్రప్రదేశ్‌లోని ఫారెస్ట్ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై ఒకటి తేదీ నుంచి సెప్టెంబరు 30 తేదీ వరకు నల్లమల అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదంటూ.. జనసంచారంపై నిషేధం విధించారు.

పులులకు ఆవాసమైన నల్లమల అడవి (Nallamala Forest)లో జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మూడు నెలలు పులుల కలయిక (Tigers mate for offspring) ఉంటుంది. దీంతో వీటికి ఎటువంటి అంతరాయం కలుకుండా అటవీశాఖాధికారులు (Forest Officers) ఈ నిబంధనలు విధించారు. అయితే దీనివల్ల నల్లమల అటవీ ప్రాంతంలోనే కొలువున్న ఇష్టకామేశ్వరి దేవి దర్శనానికి కూడా భక్తులు మూడు నెలల పాటు దూరం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల ఫారెస్ట్ ఏరియా పులుల(Tigers)కు ఆవాసమన్న విషయం తెలిసిందే. అందుకే పులుల సంతతి (Descendants of tigers) పెరిగేందుకు నల్లమల అటవీ ప్రాంతం చాలా దోహద పడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడంతో.. నల్లమల ఫారెస్ట్‌ ఏరియాను టైగర్స్ జోన్ గా ప్రకటించాయి. పులుల సంఖ్య పెరగటానికి నల్లమల అటవీ ప్రాంతం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనదిగా అధికారులు గుర్తించారు. వారి అంచనాలకు తగ్గట్లే ఇక్కడ పులుల సంఖ్య కూడా ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది.

సాధారణంగా పులుల సంతతి పెరిగేందుకు.. జులై, ఆగస్టు,సెప్టెంబర్ (July, August, September) నెలలు చాలా కీలకం. ఈ నెలల్లోనే పులులు కలుస్తూ ఉంటాయి. దీంతోనే నల్లమల అటవీ ప్రాంతంలోకి ఈ మూడు నెలల పాటు జనాలు వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఈ సమయంలో అటవీ ప్రాంతంలో పులులు స్వేచ్ఛగా తిరుగుతాయి. అందుకే ఫారెస్ట్ ఏరియా (Forest Area)కు దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ముఖ్యంగా వంట చెరకు కోసం, ఇతర అవసరాల కోసం ఎట్టి పరిస్థితిలోనై నల్లమల అడవిలోకీ వెళ్లొద్దని గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఎవరూ వెళ్లకుండా పోలీస్ పహారాను పెంచడంతో పాటు.. సీసీ కెమెరాల (CC Cameras) నిఘాను పెంచారు. అంతరించి పోతున్న పులుల జాతిని కాపాడుకోవల్సిన బాధ్యత అందరికీ ఉందని, నల్లమల అటవీ ప్రాంతంలో.. ఇప్పుడిప్పుడే పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని..దీనికి ప్రజల సహకారం కూడా అవసరమని అధికారులు అంటున్నారు.

మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంలోనే ఇష్టకామేశ్వరి దేవి కొలువు తీరిందన్న విషయం అందిరికీ తెలిసిందే. భక్తుల పాలిట కొంగు బంగారంగా పేరు గాంచిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు పులుల కలయిక కోసం..అధికారులు ఆంక్షలు విధించడంతో..ఈ మూడు నెలల పాటు ఇష్టకామేశ్వరి దేవి దర్శనం భక్తులకు లేనట్లే ఎందుకంటే భక్తులకు కూడా ఈ షరతులు వర్తిస్తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 19 =