
రోజురోజుకు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. అందుకే ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి ఇప్పుడు సాధ్యం చేసేస్తోంది. ఇప్పటికే మనుషులను, వస్తువులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే గమ్యాలకు చేర్చే సైకిళ్లతో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతోంది. అయితే దీనికి ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మారుతుంది. దీనిలో భాగంగానే తాజాగా డ్రైవర్ లెస్ కారు ఐఐటీ హైదరాబాద్‌లో సందడి చేస్తోంది.
ఇప్పుడు ఐఐటీ హైదరాబాద్‌లో క్యాంపస్ రోడ్లపై ఆటోనమస్, డ్రైవర్ లేని కార్లను టెస్ట్ డ్రైవ్ రన్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఆటోమొబైల్స్ ఫ్యూచర్ అంతా హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ షటిల్ కార్లను రెండు నెలలుగా క్యాంపస్‌లోని స్టూడెంట్స్, లెక్చరర్లు, ప్రయాణిస్తున్నారు. ఈ డ్రైవర్ లెస్ కారులోనే క్యాంపస్‌లో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా వెళ్తున్నారు. ఐఐటీకి చెందిన టిహాన్ అంటే.. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనమస్ నావిగేషన్ సెంటర్‌లో.. అభివృద్ధి చేయబడిన ఈ డ్రైవర్ లెస్ కారులు ఆటోనమస్ నావిగేషన్ కోసం వివిధ సెన్సార్లు,లైడార్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటాయి.
ఈ డ్రైవర్ లేకుండా నడిచే వెహికల్స్ డెవలప్మెంట్ ఎక్స్ టెన్షన్ రీసెర్చ్ , డేటా కలెక్టింగ్‌ను కలిగి ఉంది. నేచురల్ వాతావరణంలో వీటిని పరీక్షించడానికి వీలుగా ఐఐటీ క్యాంపస్‌లో రెండు కిలోమీటర్ల పొడవైన ట్రాక్ నిర్మించారు. సిగ్నల్స్, టర్నింగ్‌లు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్ల మీద ఉండే ఇతర అడ్డంకులు ఉండేలా ఈ ట్రాక్‌ను తయారు చేశారు. ఈ కారును..డ్రైవర్ లేకుండా 2 కిలోమీటర్లు నడిపించి 2 నెలలుగా టెస్ట్ రన్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం డేటాను కలెక్ట్ చేయడానికి.. ప్రత్యేక డేటా కలెక్టింగ్ వెహికల్స్ హైదరాబాద్ ట్రాఫిక్‌లో మోహరించాయి.
టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ ఆటోనమస్ నావిగేషన్ సెంటర్.. కేవలం డ్రైవర్ లేకుండా నడిచే ఈ షటిల్ కార్ల డెవలప్మెంట్ కోసం మాత్రమే పరిమితం కాలేదు. ఇది వైమానిక, మల్టీటెర్రైన్ వెహికల్స్‌తో పాటు వివిధ ఆటోమేటెడ్ వెహికల్స్ డెవలప్మెంట్‌పై కూడా పని చేస్తోంది. నెక్ట్స్ జనరేషన్‌కు సూటబుల్, సేఫ్ మొబిలిటీ సొల్యూషన్లను అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఆటోనమస్ వెహికల్స్ డెవలప్మెంట్‌తో పాటు ఆ వెహికల్స్ కోసం ఇండియాలో పాలసీ ఫ్రేమ్‌వర్క్, ఆటోమేటెడ్ వెహికల్స్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాలను రూపొందించడంలో కూడా ఈ సెంటర్ చురుకుగా పని చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE