మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు రేపే ప్రారంభం

Mana Ooru-Mana Badi: Minister Sabitha Indra Reddy Says Work Completed Schools will Inaugurate on February 1st,Mana Ooru-Mana Badi,Minister Sabitha Indra Reddy,Says Work Completed Schools,will Inaugurate on February 1st,Mango News,MAngo News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా పనులు పూర్తయిన పాఠశాలలను రేపే (ఫిబ్రవరి 1, బుధవారం) ప్రారంభించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

“ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలతో మొదలు పెట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తూ, రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 9,123 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని 3,497 కోట్ల 62 లక్షల వ్యయంతో చేపట్టడటం జరిగింది” అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మరోవైపు మనఊరు-మన బడి ప్రారంభోత్సవాల నేపథ్యంలో సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, బోధనేతర పరికరాల ఏర్పాటు, తదితర సదుపాయాలు, మౌలిక సదుపాయాల కల్పనపై చేపట్టిన మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ప్రారంభించాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రారంబోత్సవాలు పండుగ వాతావరణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ లను పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − fifteen =