రాజాసింగ్ స్థానంలో యువనేతకు ఛాన్స్?

A chance for a young leader to replace Rajasingh,A chance for a young leader,young leader to replace Rajasingh,Mango News,Mango News Telugu,bjp, goshamahal mla rajasingh, goshamahal ticket, Rajasingh,Telangana BJP struggles,Telangana BJP struggles with leadership crisis,Ajit Pawars wings clipped,Young Leaders Journey,Rajasingh Latest News,Rajasingh Latest Updates,Rajasingh Live News,Telangana BJP struggles Latest News,Telangana BJP struggles Latest Updates
goshamahal mla rajasingh, rajasingh, bjp, goshamahal ticket

అసెంబ్లీ ఎన్నికలవేళ తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ మొదటి జాబితాను ప్రకటించేసింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో గోషామహల్ బీజేపీ టికెట్ ఎవరికిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండుసార్లు గోషామహల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. కానీ ఈసారి రాజాసింగ్‌కు టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికీ కూడా అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయలేదు. దీంతో రాజాసింగ్‌ టికెట్‌ దక్కడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది.

గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో.. ఈసారి కూడా టికెట్ రాజాసింగ్‌కే దక్కాలి. కానీ పోయిన ఏడాది ఓ మతంపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపి.. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. ఈక్రమంలో అధిష్టానం రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పలువురు బీజేపీ కీలక నేతలు కూడా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అధిష్టానాన్ని కోరారు. కానీ ఇప్పటి వరకు కూడా అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఇంతకముందు రాజాసింగ్‌ మాదిరిగానే మరికొందరు నేతలు కూడా వివాదాస్పదంగా వ్యాఖ్యానించడంతో.. అధిష్టానం వేటు వేసింది. ఇప్పుడు రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తే.. వారిపై కూడా వేటు ఎత్తివేయాల్సి వస్తుందని అధిష్టానం భావిస్తోంది.

మరి రాజాసింగ్‌ను కాదని గోషామల్ టికెట్ ఎవరికిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయిదే కొద్దిరోజులుగా ఓ యువనేత పేరు గట్టిగా వినిపిస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు.. విక్రమ్ గౌడ్‌కు గోషామహల్ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు విక్రమ్ గౌడ్ కూడా కొద్దిరోజులుగా ప్రజలకు చేరువ కావడంపై ఫోకస్ పెట్టారు. జోరుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. మరి రాజాసింగ్‌ స్థానంలో పోటీ చేసి ముఖేష్ గౌడ్ గెలవగలడా?.. లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =