ఫిబ్రవరి 5న పీఎం మోదీ హైదరాబాద్ పర్యటన, ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

CS Somesh Kumar, CS Somesh Kumar Held Co-ordination Meeting on PM Modi Visit to Muchintal, CS Somesh Kumar Held Co-ordination Meeting on PM Modi Visit to Muchintal and ICRISAT, ICRISAT, Inauguration of Samatha Murthy Statue, Muchintal, PM Modi Meeting, PM Modi Visit to Hyderabad, PM Modi Visit to Muchintal, PM Modi Visit to Muchintal and ICRISAT, ramanuja statue inauguration, Ramanujacharya Millennium Celebrations, ramanujacharya statue in hyderabad, Samatha Moorthi Sri Ramanujacharya Statue, Samatha Murthy Statue, Statue of Equality, statue of equality inauguration, Statue of Equality Sri Ramanujacharya, Statue of Equality Sri Ramanujacharya Millennium Celebration Starts

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5, శనివారం నాడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆ రోజున ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు మరియు ముచ్చింతల్​ లోని శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్ లో ముచ్చింతల్, ఇక్రిసాట్ పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్త్ ను బ్లూ బుక్‌ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. వేదికల వద్ద తగు వైద్య శిబిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు.

వీవీఐపీ సందర్శన సమయంలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేపట్టాలని, కోవిడ్-19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని, తగినంత లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. వీవీఐపీ సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, ఇంధన, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శ ఎస్.ఏ.ఎం రిజ్వీ, రవాణా, రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here