బీఆర్‌ఎస్‌.. గ్రేటర్‌లో గడ్డుకాలం

BRS Hard Time in Greater,BRS Hard Time,Hard Time in Greater,Mango News,Mango News Telugu,BRS, CM kcr, ktr, telangana assembly elections, greater hyderabad,Telangana Assembly polls,Causes of Difference in BRS,Telangana Elections 2023,Telangana Elections 2023 Latest News,Telangana Elections 2023 Latest Updates,BRS Latest News,BRS Latest Updates,BRS Hard Time News Today,BRS Hard Time Latest Update
brs, cm kcr, ktr, telangana assembly elections, greater hyderabad

రాజకీయంగా.. ఆర్థికంగా.. తెలంగాణకు గ్రేటర్‌ హైదరాబాద్‌ గుండెకాయ లాంటిది. 24 నియోజకవర్గాలు మహా నగర పరిధిలోనే ఉన్నాయి. మజ్లిస్‌ ప్రాంతాల్లో మినహా.. మిగతా అన్ని చోట్లా అధికార పార్టీదే హవా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో అత్యధికంగా టీడీపీకి పట్టం కట్టిన గ్రేటర్‌వాసులు.. అనంతరం గులాబీ పార్టీకి జై కొడుతూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గోషామహల్‌ మినహా.. అన్నిచోట్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే గెలిచారు. రాజధానే ఆ పార్టీని నిలబెడుతూ వస్తోంది. అంత పట్టున్న పార్టీని ఇప్పుడు నేతలు వీడుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గట్టి పట్టున్న కార్పొరేటర్‌ దంపతులు కారు దిగి.. హస్తం గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 వార్డులకు గాను బీఆర్‌ఎస్‌ 56 స్థానాల్లో విజయం సాధించింది. ఎప్పటి నుంచో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా ఎదగాలని భావిస్తున్న కార్పొరేటర్‌ విజయారెడ్డి బీఆర్‌ఎస్‌ లో ఉంటే ఆ అవకాశం రాదని గతంలోనే కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మాదాపూర్‌, హఫీజ్‌పేట కార్పొరేటర్‌ దంపతులు జగదీశ్వర్‌గౌడ్‌, పూజితగౌడ్‌ హస్తం గూటికి చేరారు. అంతేకాదు.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు అప్పట్లో ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ కార్పొరేటర్‌ ప్రేమ్‌కుమార్‌, మచ్చబొల్లారం కార్పొరేటర్‌ రాజ్‌ జితేంద్రనాథ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌ను ఐదుగురు కార్పొరేటర్లు వీడగా.. రెండు దఫాలుగా బీజేపీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల సంఖ్య కౌన్సిల్‌లో 56గా ఉంది. పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వారు ఇతర పార్టీలోకి చేరుతుండడం గమనార్హం.

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్‌ ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌, ఆయన సతీమణి, బీఎన్‌రెడ్డి నగర్‌ మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న కూడా ఇటీవల హస్తం గూటికి చేరారు. శివారు ప్రాంతాల్లో బలంగా ఉందని అధికార పార్టీ భావిస్తుండగా.. అక్కడి నియోజకవర్గాల్లో ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఎల్‌బీనగర్‌, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరిలో నేతలు పార్టీని వీడారు. దీంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉప్పల్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి అధికార పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిత్వంపై ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 10 =