ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 813కు పెరిగింది. రోజురోజుకి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసం ప్రారంభం అయిన తరుణంలో ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. “పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. మీ ప్రార్థనలను ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపండి. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలి. కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడాలని ప్రార్థించండని” చంద్రబాబు పేర్కొన్నారు.
పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. మీ ప్రార్థనలను ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపండి. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలి. కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడాలని ప్రార్థించండి pic.twitter.com/9YDqyObtfM
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 23, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu




























































