దుర్గగుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్‌

13 Durga Temple Employees Suspended, 13 Durga Temple Employees Suspended After Recent ACB Searches, ACB continues searches in Kanaka Durga temple, ACB sleuths inspect offices at Durga temple, ACB’s Kanaka Durga searches, Durga Temple Employees Suspended, Kanakadurga Temple, Mango News, Thirteen Officials Suspended For Irregularities, Vijayawada, Vijayawada Kanakadurga Temple

విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గుడిలోని వివిధ విభాగాలపై మూడు రోజులు పాటుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రభుత్వానికి అందించిన ప్రాథమిక సమాచారం మేరకు గుడిలో ఏడు విభాగాల్లో పనిచేసే 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దర్శన టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరలు భద్రపరిచే విభాగం, షాపుల లీజు, అన్నదానం సహా ఇతర విభాగాల్లో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో మొత్తం ఏడు విభాగాల్లో పనిచేసే 13 మంది ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దుర్గగుడి ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సోమవారం నాడు ఉత్తర్వులిచ్చారు. సస్పెండ్ అయిన వారిలో ఐదుగురు సూపరింటెండెంట్‌ స్థాయి సిబ్బంది కూడా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ