ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే వుంది. మే 7, గురువారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1833 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 8,087 సాంపిల్స్ ని పరీక్షించగా 56 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కొత్తగా కృష్ణా జిల్లాలో 16, గుంటూరు జిల్లాల్లో 10, కర్నూల్, విశాఖపట్నం జిల్లాల్లో 7 చొప్పున, కడపలో 6, నెల్లూరులో 4, అనంతపూర్, విజయనగరం జిల్లాలలో 3 చొప్పున మొత్తం 56 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1833 కు పెరిగింది. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 38 మంది మృతి చెందగా, మరో 780 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు ప్రకటించారు. కొత్తగా బుధవారం ఒక్కరోజే 51 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు చెప్పారు. ఇక ప్రస్తుతం 1015 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 6, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1107 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 11 కేసులు నమోదయ్యాయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, 648 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 430 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 సాంపిల్స్ ని పరీక్షించగా 56 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.కొత్తగా 51 మంది కోలుకొని డిశ్చార్జ్ చేయబడ్డారు
.
మొత్తం 1833 పాజిటివ్ కేసు లకు గాను 780 మంది డిశ్చార్జ్ కాగా 38 మంది మరణించారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1015 pic.twitter.com/sNpOHMpWhG— ArogyaAndhra (@ArogyaAndhra) May 7, 2020
Media bulletin
Date: May 6, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/17NIVHwOa8
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 6, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]