అక్టోబర్ 1 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?

Andhra Pradesh, Andhra Pradesh cabinet, Andhra Pradesh Cabinet Meet, Andhra Pradesh cabinet meet on October 1, Andhra Pradesh cabinet meeting, Andhra Pradesh Cabinet to Meet on October 1st, Andhra Pradesh CM YS Jagan Mohan Reddy, Andhra Pradesh Latest Updates, AP Cabinet Meet, YS Jagan Cabinet Meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1, గురువారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలపై సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 3 గంటల్లోగా అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని ఆయా శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా గత కేబినెట్ సమావేశం సెప్టెంబర్ 3 న జరగగా, రైతులకు ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం, ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగులపై నిషేధం, ఏపీ‌ ఫిషరీస్‌ ఆర్డినెన్స్‌–2020, ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు భూమి కేటాయింపు, ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు వంటి పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu