కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల జీతం, సీఎం వైఎస్ జగన్ నిర్ణయం

12 months Salary to 5042 Contract Lecturers Instead of 10 Months, andhra pradesh contract lecturers salaries, AP CM YS Jagan, ap contract lecturers salaries, AP News, CM nod to lecturers plea, CM YS Jagan Agreed to give 12 months Salary to 5042 Contract Lecturers, Contract lecturers to get full salary, Contract lecturers to get full salary in AP, Pay salaries to contract lecturers

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఓకేషనల్, ప్రైవేట్‌ ఓరియంటల్‌‌ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల విజ్ఞప్తి మేరకు 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచేందుకు సీఎం అంగీకరించారు. దీంతో వారికీ 2020-21 సంవత్సరానికి గానూ 10 నెలలకు బదులు 12 నెలలు వేతనం అందనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 5,042 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు లబ్ది చేకూరనుంది. ఇందుకు సంబంధించి ఏపీ‌ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 18 =