రేపే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం.. పంపిణీ చేయనున్న సీఎం జగన్

AP CM YS Jagan Will Distribute Plots For Poor To Construct Houses in R5 Zone at Amaravati Tomorrow,AP CM YS Jagan Will Distribute Plots,Plots For Poor To Construct Houses,Houses in R5 Zone at Amaravati Tomorrow,Mango News,Mango News Telugu,Expedite Construction of Houses in R5 Zone,AP CM YS Jagan To Construct Houses in R5 Zone,AP CM YS Jagan,AP CM YS Jagan Latest News,AP CM YS Jagan Latest Updates,AP Plots For Poor Latest News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆర్‌-5 జోన్‌లో పేదలకు రేపు (శుక్రవారం, మే 26, 2023) ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటపాలెంలోని సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే పబ్లిక్ మీటింగ్‌ వేదికను ఏర్పాటు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరం సీఎం జగన్ ఈ వేదిక నుంచే ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో మొత్తం 51 వేల 392 మంది కోసం 25 లే ఔట్లను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. దీంతో రేపు లబ్దిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో రేపు పట్టాల పంపిణీ అనంతరం సత్వరమే ఇళ్ల నిర్మాణం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కాగా ఆర్‌-5 జోన్‌లో ఇళ్ళ పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్‌- 5జోన్‌గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 1134 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, నవులూరు, బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరం తదితర గ్రామాల పరిధిలో ఈ లే అవుట్లను సిద్ధం చేసింది. అయితే మరోవైపు అమరావతి రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వారు పట్టాల పంపిణీ కార్యక్రమానికి అడ్డుపడతారన్న అనుమానంతో పోలీసులు ముందస్తు అరెస్టులు, నిషేధాజ్ఞలకు దిగారు. దీంతో అమరావతి పరిసర ప్రాంతంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here