టీటీడీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు

TTD Board Takes Key Decisions Today, TTD Board Meeting, YV Subbareddy, TTD, TTD Chairman, AP News

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 28, శనివారం నాడు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను తిరుమలలో జరిగిన మీడియా సమావేశంలో వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు:

  • టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు నియామకానికి ఆమోదం
  • 2019-20 వార్షిక బడ్జెట్‌ కింద రూ.3243 కోట్లకు పాలకమండలి ఆమోదం
  • రూ.14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం
  • టీటీడీ ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు
  • ఘాట్‌రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం
  • ఘాట్‌ రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.10 కోట్లు
  • రూ.14.30 కోట్లతో టీటీడీ పరిపాలనా భవనం మరమత్తులు
  • జమ్ముకశ్మీర్‌, వారణాసిలోనూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేలా ప్రణాళికలు
  • 2019-20 సంవత్సరానికి గానూ శ్రీవారి హుండీ ఆదాయం రూ.1285 కోట్లు
  • ప్రసాదాల విక్రయం ద్వారా సమకూరిన ఆదాయం రూ.330 కోట్లు
  • సంక్రాంతి లోపు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం దిశగా అడుగులు

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =