ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలతో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ) పాటుగా పలుచోట్ల ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు నవంబర్ 15 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ జరిగిన అన్ని చోట్ల బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నేడు జరిగే ఓట్ల లెక్కింపు కోసం 23 కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 325 డివిజన్/వార్డు స్థానాలకు పోలింగ్ జరగగా, మొత్తం 1,206 మంది బరిలో నిలిచారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక ఈ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీపై ప్రత్యేక ఆసక్తి నెలకుంది. ఈ స్థానాన్ని అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించడంతో ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకుంది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవం కాగా 24 స్థానాల్లో పోలింగ్ జరిగింది. కాగా కుప్పంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ