రేపు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాలుగో విడత నగదు జమ

CM YS Jagan to Release Fourth Phase YSR Nethanna Nestham Funds tomorrow at Pedana, Fourth Phase YSR Nethanna Nestham Funds, YSR Nethanna Nestham Funds, AP CM YS Jagan Pedana visit, AP CM YS Jagan Pedana Tour, YSR Nethanna Nestham, 2022 YSR Nethanna Nestham, AP CM YS Jagan Mohan Reddy, Pedana, YSR Nethanna Nestham News, YSR Nethanna Nestham Latest News And Updates, YSR Nethanna Nestham Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఆగస్టు 25, గురువారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెడనలో జరిగే “వైఎస్ఆర్ నేతన్న నేస్తం” నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదు జమచేయనున్నారు. ముందుగా గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. 10.50 గంటలకు పెడన బంటుమిల్లి రోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ముందుగా లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తం నగదు పంపిణీ కార్యక్రమంతో పాటుగా గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు.

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులై ఉండి సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల నగదును ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. ఐదేళ్లల్లో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 సాయం ఆర్థికసాయం అందనుండగా, ఇప్పటికే మూడువిడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయింది. ఈ క్రమంలోనే రేపు వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమం చేపట్టి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదు జమచేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + four =