ఏపీలో సంక్రాంతి పండగ తర్వాతే నైట్ కర్ఫ్యూ అమలు

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. సోమవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చిన నైట్ కర్ఫ్యూని ఎత్తేసింది. సంక్రాంతి పండగ తర్వాత 18వ తేదీనుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన జీవోను జారీ చేసింది. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో.. వివిధ పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో పల్లెలకు ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండగ అనంతరం ఆంక్షలను కఠినతరం చేయనుంది ప్రభుత్వం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ